పనులను నాణ్యతతో చేపట్టాలి.


–ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.
ఫోటో.పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే .
జ్ఞానతెలంగాణ , బోధన్
అమ్మబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పాఠశాలలో చేపడుతున్న మరమ్మతు పనులను నాణ్యతగా చేపట్టాలని లేని ఎడల చర్యలు తప్పవని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఆయన బోధన్ మండలం పెంటాఖుర్దు, సాలూర మండలం తగ్గెల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేపడుతున్న పనులను పరిశీలించారు.ఈ సంధర్బంగ ఆయన మాట్లాడుతూ పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే వరకు పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేలా కృషి చేయాలని సూచించారు.పనుల్లో నిర్లక్ష్యం చేసిన నాసిరకంగా చేసిన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.ఆయన వెంట నాయకులు గంగాశంకర్, ఇల్తెపు శంకర్, ఎంఈఓ నాగనాథ్,,నాగేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

You may also like...

Translate »