వ్యాపార సంస్థలలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు.

వ్యాపార సంస్థలలో తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు.
జ్ఞాన తెలంగాణ – బోధన్
వ్యాపారులు వినియోగదారుల పట్ల మోసపూరితంగా వివరించడంతో వినియోగదారుల నుండి అందిన ఫిర్యాదుల మేరకు శుక్రవారం జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారులు బోధన్ పట్టణంలోని పలు కిరణా వ్యాపార సముదాయాలలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో వస్తువులపై తయారీ తేది, గడువు ముగింపు తేదీలు, సరుకుల నాణ్యత, తూకంలో మోసాలు లేకుండా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వినియోగదారుల పట్ల ఇబ్బందిగా వ్యవహరించరాదని, సరుకులు నాణ్యతగా ఉండాలని లేనియెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించరు. ఈ తనిఖీలలో జిల్లా తూనిక,కొలతల శాఖ అధికారి సుజత్ ఆలీ,ఇన్స్పెక్టర్ నరేష్ తదితరులు ఉన్నారు.