భద్రాద్రి జిల్లాలో విషాదం

భద్రాది జిల్లా:మే 22
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. కార్ డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.

మడకం సాయి, లిఖిత దంపతుల కుమార్తె కల్నిష… ఇంటి ఆవరణలో ఆడుకుంటూ… కారులోకి ఎక్కింది. కాసేపటికి కారు డోర్స్ ఆటోమెటిక్‌గా లాక్ కావడంతో అందులోనే చిన్నారి కల్నిష ఉండి పోయింది.

చిన్నారి కనిపించడం లేదని వెతుకుతున్న తల్లిదండ్రులు కారులో పడి ఉన్న చిన్నారి ని చూసి అద్దాలు పగల గొట్టారు. చిన్నారిని బయటకు తీసుకురాగా అప్పటికే చనిపోయింది.

చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

You may also like...

Translate »