రక్తసితమవుతున్న జాతీయ రహదారి పనులు..

జ్ఞాన తెలంగాణ హుస్నాబాద్.. ఇప్పుడే మొదలవుతున్న పందిళ్ళ బ్రిడ్జి దృశ్యం గత రెండేళ్ల క్రితం చేపట్టిన హుస్నాబాద్ మీదుగా రామయంపేట నుండి ఎలుకతుర్తి వరకు జాతీయ రహదారి పనులు బుత్యదారి పుణ్యమా అని రక్తమోడుతున్నాయి. ఇదంతా కేవలం గుత్తేదారు నాణ్యత లోపించిన రహదారి పనుల వల్లనేనని గత రెండేళ్ల క్రితం చేపట్టిన ఈ పనులు నిర్లక్ష్యంగా పనులు చేపట్టడం మూలాన సంభవిస్తుందని పలువురు ఆరోపిస్తున్న కాంట్రాక్టర్ తన ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్న విషయంపై ప్రజల నుండి తీవ్ర ఆగ్రహావేషాలు వ్యక్తం అవుతున్నాయి. రక్త మొడుతున్న ఈ రహదారి పనుల్లో బలి పశువులుగా మారిన కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజానీకం నుండి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రయాణికులు కుస్తాబాద్ నియోజకవర్గంలోని ఎలుకతోటి నుండి సిద్దిపేట జిల్లా రాజగోపాలపేట వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి నెంబర్ 765 డిజి పనులు నత్తనడకన సాగుతున్నాయి 2022 సెప్టెంబర్ ఏజీ కన్ స్ట్రాక్షన్ వారు ఈ దారిని నిర్మించేందుకు 66 కిలోమీటర్లకు రూ టెండర్లు దక్కించుకుని అగ్రిమెంట్ చేసుకున్నారు అనంతరం రెండు నెలల ఆలస్యంగా పనులు ప్రారంభించినట్లు అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2022 నవంబర్లో ప్రారంభమైన పనులు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుండగా పని సగం వరకు అయినా పూర్తి కాకపోవడంతో వాహనదారులతో పాటు ప్రజలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు అసంపూర్తిగా చేస్తున్న ఈ రహదారి పనులతో వాహనదారులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ రహదారిలో మొత్తం 124 అలవాట్లు ఉండడంతో గుత్తేదారులు వాటిని తొలగించి పక్కనుండి వెళ్లడానికి ఎలాంటి తారు రోడ్డు వేయకపోవడంతో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పనులు మొదలుపెట్టిన బండి వారి పల్లి మండలం సమీపంలో కారు ప్రమాదం జరగా అందులో ఒకరు మృతి చెందారు.నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. హుస్నాబాద్ పరిధిలో 15 రోడ్డు ప్రమాదాలు జరగాగ అందులో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోహెడ మండలంలో కల్వర్టు కోసం తీసిన గుంతలో పడి ఒకరు మరణించారు పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొద్ది రోజుల క్రితమే రోడ్డు పక్కన తీసి గుంతలోకి కారు దూసుకెళ్లి అందులో ఉన్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా మరో ముగ్గురు సైతం రోడ్డు ప్రమాదంలో మరణించడంతోపాటు దాదాపు 60 మంది రోడ్డు ప్రమాదాల వల్ల తీవ్ర గాయాల పాలయ్యారు గుత్తి దారుల నిర్లక్ష్యం అధికారుల పాలకుల పట్టింపు లేకపోవడం వల్లే పనులు నత్త నడకన సాగుతున్నాయి అని ప్రజలు ఆపరేషన్ వ్యక్తం చేస్తున్నారు. 66 కిలోమీటర్ల పొడవున్న జాతీయ రహదారిలో 124 కల్వర్టులు ఉన్న ఇప్పటికీ 64 కల్వర్టులు పూర్తయ్యాయి. అయితే అన్ని బ్రిడ్జిలలో పెద్దదైన పందిళ్ల బ్రిడ్జి కాంట్రాక్టర్ పనులు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాడు. ఈ పనిని పూర్తి చేసేందుకు ఇంకో మూడు నెలలు పట్టవచ్చని అక్కడున్న పనిచేసే కూలీలు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతి సంవత్సరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు మత్తడి పొంగి నేరుగా పందిళ్ళ వాగు వంతెన పైనుండి పోతుంది ఈ సందర్భంలో సిద్దిపేట నుండి హుస్నాబాద్ వరకు రాకపోకలను నిలిపివేయాల్సి వస్తుంది. వర్షాకాలం ముందు దగ్గర దగ్గరగా ఉంది కాబట్టి బ్రిడ్జి పనులను గుత్తేదారు కాంట్రాక్టర్ వేగం పెంచి త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. లేనియెడల హుస్నాబాద్ కు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేయడం జరుగుతుందని. తొందరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం ఎంతైనా అవసరమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You may also like...

Translate »