ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి : సదానందం గౌడ్.

ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు చేపట్టాలి : సదానందం గౌడ్.
జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిధి మే 21.
సిద్దిపేట జిల్లా చేర్యాల స్థానిక ఎస్టియు కార్యాలయంలో మంగళవారం రోజు చేర్యాల మండల ప్రధాన కార్యదర్శి కంతుల రాములు ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా ఎస్టియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐఎస్టిఎఫ్ జాతీయ కార్యదర్శి సదానందం గౌడ్ హాజరై ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
వేసవి కాలం సెలవులలో బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2010 కంటే ముందు నియామకం అయిన ఉపాధ్యాయులకు టెట్ తో సంబంధం లేకుండానే సింగల్ బెంచ్ జడ్జి తీర్పు ప్రకారము పదోన్నతులు కల్పించాలని. రావాల్సిన కరువు భత్యాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పట్నం భూపాల్, ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మట్టపల్లి రంగారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖాతా యాదగిరి, రాష్ట్ర కార్యదర్శి రేకులపల్లి లింగారెడ్డి, మద్దూర్ మండల అధ్యక్షుడు స్వర్ణ కుమార్, మద్దూర్ మండల ప్రధాన కార్యదర్శి కనకయ్య, దూల్ మిట్ట ప్రధాన కార్యదర్శి పన్నీరు రాజు తదితరులు పాల్గొన్నారు.