తాగునీటి సమస్య పై నడుం బిగించిన రాజారం యువత.

తాగునీటి సమస్య పై నడుం బిగించిన రాజారం యువత.
- పత్రికల్లో వచ్చిన వార్తకు స్పందించి త్రాగునీటి సమస్యకు పరిష్కారం.
- స్వంత ఖర్చులతో మోటారు కొనుగోలు. జ్ఞాన తెలంగాణ మే 21, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్: పాలేరు నియోజకవర్గం రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి విలాఖలో తిరుమలయపాలెం మండలం రాజారం గ్రామంలో గత రెండు నెలలుగా మూడు మోటార్లు పూర్తిగా చెడిపోయి తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రెండు రోజుల క్రితం గ్రామపెద్దలు రెండు మోటార్లు స్వంత నిధులతో ఏర్పాటు చేయగా సామ వారి బజార్లో సుమారుగా 100 కుటుంబాలు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న విషయం పత్రికల్లో చూసి గ్రామ యువకులు బాణాల వెంకట్ రెడ్డి, కొప్పుల ఉపేందర్ రెడ్డి, రంగాపురం బాలకృష్ణ గౌడ్, పేర్ల గణేష్, పేర్ల నాగయ్య, కందాళ క్రాంతికుమార్ తదితరులు ముందుకు వచ్చి చందాలు వేసి ఈరోజు కొత్త మోటార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామపెద్దలు సామబజార్ ప్రజలు యువతను అభినందించారు.