సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం..

సుందరయ్య జీవితం నేటి తరానికి ఆదర్శం..
వర్కట్ పల్లి గ్రామంలో సుందరయ్య గారి 39వ వర్ధంతి
జ్ఞాన తెలంగాణ వలిగొండ మే 19
భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య జీవితాంతం పేదలు వ్యవసాయ కూలీల,కార్మికుల, పేద ప్రజల కోసం పనిచేసిన గొప్ప మహనీయుడని ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శమని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు
ఈరోజు మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు
ఈ సందర్భంగా సిర్పంగి స్వామి మాట్లాడుతూ భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన పుచ్చలపల్లి సుందరయ్య పేద ప్రజలు వ్యవసాయ కూలీలు, కార్మికుల,దళితుల కోసం తన జీవితాన్ని అంకితం చేశాడన్నారు,ఉత్తమ పార్లమెంట్ సభ్యునిగా సైకిల్ పై వెళ్లి రాజకీయాల్లో అందరికీ ఆదర్శంగా నిలిచిన గొప్ప నాయకుడన్నారు పిల్లలు పుడితే తనలో స్వార్థం పెరుగుతుందనే భావనతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుని తన జీవితం మొత్తం పేదల కోసం పనిచేసిన త్యాగమూర్తన్నారు స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాల్య దశలోనే పోరాటాలకు ఉత్తేజితులై కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులై దక్షిణ భారతదేశంలో సిపిఎం నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మహనీయుడని సిపిఎం మొదటి జాతీయ కార్యదర్శిగా పనిచేశారని ఎంపీ ఎమ్మెల్యేగా పార్లమెంటు,అసెంబ్లీలో చట్టసభలకు వన్నెతెచ్చిన రాజకీయ సిద్ధాంతకర్త అన్నారు ఆయన స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమైందని ఆయన చూపిన దోపిడీ,పీడనలేని సమ సమాజం కోసం,కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహించడమే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళని,ఆయన ఆశయ సాధనకు పునరంకితం కావాలని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం వర్కట్ పల్లి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి సిపిఎం నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి, ఆకుల మారయ్య,రొండి రాములు,గోగు కిష్టయ్య,రొండి మల్లేశం, నాగవేల్లి లక్ష్మయ్య,మెట్టు లక్షమ్మ,సిర్పంగి స్వప్న,బాబు తదితరులు పాల్గొన్నారు