బీజేపీ లక్ష్యం ఆప్ అంతం – కేజ్రీవాల్, ఉద్రిక్తత..!!

ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీకి ఆప్భవిష్యత్తులో సవాలుగా మారుతుందన్న భయంతోనే ఆపరేషన్ ఝాడును ప్రారంభించిందని అన్నారు. ఆప్ నేతల ఆరెస్టులకు నిరసనగా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనకు ముందు తమ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో పోలీసులు144 సెక్షన్ అమలుచేసారు.
కేజ్రీవాల్ ఆగ్రహం ఆప్‌ను అంతం చేయాలన్న ఉద్దేశంతో ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు బిజెపి ఆపరేష్ ఝాడు కార్యక్రమాన్ని చేపట్టిందని బిజెపి, ప్రధానమంత్రి నరేంద్ర మోడిలపై ఆమ్‌ఆద్మీపార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా … బిజెపి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో ఆదివారం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతలకు కారణమూంది. ఆమ్‌ఆద్మీ పార్టీని మట్టికరిపించాలని ప్రధాని నిర్ణయించుకున్నారని విమర్శించారు.
మోదీ లక్ష్యం అదే ఆప్ ఎదుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన చెందుతున్నారు. పార్టీ చాలా వేగంగా అభివృద్ది చెందిందన్నారు. ఆప్‌ను అణిచివేసేందుకే ఆపరేషన్ ఝాడును బీజేపీ ప్రారంభించిందిని ఆరోపించారు. రానున్న కాలంలో ఆప్నేతలను అరెస్ట్ చేస్తారన్నారు. బీజేపీకి ఆప్పెద్ద సవాల్‌గా మారుకుండా ఉండేందుకు భవిష్యత్తులో మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తారని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయాన్ని మూసి వేసి వీధుల్లోకి తీసుకొస్తారని వివరించారు. మున్ముందు మనకు పెద్ద సవాళ్లు ఉంటాయని చెప్పిన కేజ్రీవాల్… వాటిని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.