Sreeja Konidela: అన్ని ప్రశ్నలకు ఇదొక్కటే సమాధానం.. తొలిసారి మనసులోని బాధను పంచుకున్న మెగా డాటర్!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు.. మెగా డాటర్ శ్రీజ కొణిదెల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో కల్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాపకు జన్మను ఇచ్చాకా ఆయనకు దూరం అయింది. ప్రస్తుతం అతడికి దూరంగా ఉంటున్న ఈమె తాజాగా షాకింగ్ పోస్ట్ పెట్టింది. ముఖ్యంగా భర్తతో విడాకుల గురించి తనను ఎప్పుడూ అడుగుతూ ట్రోల్స్ చేసే వాళ్లకు సమాధానం చెప్పింది. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ కూడా అయింది. అన్ని ప్రశ్నలకు ఇదొక్కటే ఆన్సర్ అంటూ వివరించింది. అయితే ఆమె చెప్పిన ఆ ఒక్క సమాధానం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మెగా ఫ్యామిలీలో పుట్టి చాలా రిచ్ గా పెరిగిన మెడా డాటర్ శ్రీజ జీవితంలో అనేక బాధలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమెకు సంబంధంచిన పెళ్లి వార్తలు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈమె తొలిసారి ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇంట్లోంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్న ఈమె ఓ పాప పుట్టాక అతడికి దూరం అయింది. భర్తతో విడాకులు తీసుకుని మరీ తల్లిదండ్రుల చెంతకు చేరింది. తన కూతురును పెంచుకుంటూ లైఫ్ లో ముందుకెళ్లింది. అయితే కూతురు ఒంటరిగా జీవించడం ఇష్టం లేని చిరంజీవి.. ఆమెకు రెండో పెళ్లి చేశాడు. ముఖ్యంగా ఓ హీరోతో ఘనంగా వివాహం జరిపించాడు.

హీరో కల్యాణ్ దేవ్ తో శ్రీజకు రెండో పెళ్లి చేయించారు మెగా దంపతులు. ఇక వీరికి కూడా ఓ పాప పుట్టింది. కల్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించాడు కూడా. విజేత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండో పెళ్లి తర్వతా ఆమె లైఫ్ సెట్ అయింది అంతా అనుకున్నారు. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు భర్తతో హాయిగా గడుపుతున్న ఈమెను చూసి అంతా మురిసిపోయారు. కానీ ఆ ఆనందాన్ని ఎంతో కాలం కాపాడలేకపోయింది శ్రీజ. ముఖ్యంగా భర్త కల్యామ్ దేవ్ తో మనస్పర్థల కారణంగా ఆయనకు దూరం అయింది. మళ్లీ ఇద్దరు పిల్లలను తీసుకుని తల్లిదండ్రుల చెంతకు చేరింది.

You may also like...

Translate »