పుచ్చలపల్లి సుందరయ్య కునివాళులు అర్పించిన

సిపిఎం మండల కార్యదర్శి అలువాల రవికుమార్

సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల శేఖర్

జ్ఞాన తెలంగాణ, (మహేశ్వరం)

పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి అలువాల రవికుమార్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన నాయకుడు అన్నారు చిన్నతనంలోనే ఆ గ్రామంలో దళితుల పట్ల ఆ ఊరి దొరలు చూపిస్తున్న కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల పక్షాన నిలబడి సహ పంక్తి భోజనాలు వడ్డించి కుల నిర్మూలన కోసం కృషి చేసిన నాయకుడు ఆ ప్రాంతంలోనే భూమిలేని నిరుపేదలకు అండగా నిలబడి కూలి సంఘం పెట్టి హక్కుల సాధించిన నేత, విద్యార్థి , యువజన, రైతు, మహిళ ల అనేక సమస్యల పట్ల నిరంతరం పోరాడిన నాయకుడు దక్షిణ భారత దేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించాలని అనేక అవంతరాలు ఎదురొచ్చిన ఎన్ని కష్టాలు ఎదురైనా వెనకడుగు వేయకుండా పోరాడిన ధీరుడు. తన సతీమణి లీలా సుందరయ్య సైతం సుందరయ్యకు అండగా నిలబడింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరుగుతున్న క్రమంలో ఈ పోరాటానికి అండగా నిలిచి అనేక సందర్భాలలో ప్రత్యక్షంగా పాల్గొని సమావేశాలు జరిపి నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉదృతం చేసిన నాయకుడు దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించి మొట్టమొదటి పార్లమెంటు ప్రతిపక్ష నేతగా నిరాడంబరంగా జీవించిన సుందరయ్య పార్లమెంటుకు సైకిల్ పై వెళ్లిన సందర్భం చరిత్ర మర్చిపోలేదు ప్రజా సమస్యల పట్ల స్పష్టంగా ప్రభుత్వానికి విన్నవించి పరిష్కరించే విధంగా కృషి చేసిన నాయకుడు సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి సరైన మార్గంలో పార్టీని నడిపిన నాయకుడు ప్రజల పట్ల కార్యకర్తల పట్ల అన్యోన్యంగా ఉంటూ దోపిడి వర్గాలపై పోరాట మార్గమును ఉదృతం చేసిన నాయకుడు మార్క్స్ ఎంగేల్స్ లెనిన్ స్టాలిన్ ల ఆచరణను భారతదేశంలో అమలు చేయాలని దోపిడి రహిత సమాజాన్ని నిర్మించాలని కృషి చేసిన నాయకుడు ప్రజాప్రతినిధిగా ప్రజల కోసం ఎలా ఉండాలో ఆచరించి చూపిన నాయకుడు అన్నారు. భవిష్యత్ తరాలు ప్రజల పట్ల శ్రమ పట్ల గౌరవంతో ఉండాలని పిలుపునిచ్చిన నాయకుడు ఆయన స్ఫూర్తితో పేద ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు చేయడంలో నేటి యువతరం ముందుకు సాగాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ ఏర్పుల శేఖర్, సిపిఎం నాయకులు పెంజర్ల జగన్ భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు కటికల శంకర్, వెయ్యల రవి, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »