ఆర్టీసీ డిపోలో మెగా వైద్య శిబిరం.

ఆర్టీసీ డిపోలో మెగా వైద్య శిబిరం.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ఆర్టీసీ ఎం.డీ సజ్జనార్ ఆదేశాల మేరకు శనివారం బోధన్ పట్టణంలోని ఆర్టీసీ డిపోలో మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు.ఈ గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ 2.0 వైద్య శిబిరంలో ఆర్టీసీ కార్మికులకు, సిబ్బందికి వైద్యులు ఆరోగ్యపరీక్షలు నిర్వహించి మందులు అందించారు. ఇందులో భాగంగా ప్రతి ఉద్యోగికి హెల్త్ చెకప్ చేశారు. ఈ వైద్య శిబిరాన్ని ఆర్.ఎం జానీరెడ్డి సందర్శించి ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాస్ , ఎం ఎఫ్ , సిఐ పాల్గొన్నారు.