కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక కార్యక్రమలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
జ్ఞాన తెలంగాణ: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఎన్నికల్లో పనిచేసిన కందికట్కూర్ గ్రామనికి చెందిన న్యాత అశోక్ అనే కార్యకర్త ను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాఘవ రెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ ఎంతటి వారైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు తప్పవున్నారు.ఈ కార్యక్రమంలో అధికార ప్రతినిధి పసుల వెంకటి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్,ఎంపీటీసీ కరివేదా కర్ణాకర్ రెడ్డి, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు ప్రసాద్,యస్సీ సెల్ అధ్యక్షులు రాజేశం, పట్టణ అధ్యక్షులు మామిడి నరేష్,సీనియర్ నాయకులు బద్దం ఎల్లారెడ్డి, బడుగు లింగం, రవీందర్ రెడ్డి,అనిల్,చంద్రమౌళి, అశోక్,కాసుపాక రమేష్,కోటేశ్వర్, దాసు,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.