కన్నులపండువగా వాసవిమాతజయంతి వేడుకలు


జ్ఞాన తెలంగాణ జఫర్ గఢ్


ఆర్యవైశ్యుల ఇలవేలుపు అయిన వాసవిమాత జయంతి ఉత్సవాలను
ఆర్యవైశ్యులు కన్నుల పండువగా నిర్వహించారు.
శనివారం అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్యవైశ్యులు మండల కేంద్రంలోని వైశ్యభవనంకు చేరుకుని అమ్మవారి చిత్రపటాన్ని పూలమాలలతో అలంకరించి పూజాకార్యక్రమాలను నిర్వహించారు.
పెనుగొండలోని కుసుమశ్రేష్ఠి-కుసుమాంబ పుణ్యదంపతులకు జన్మించిన వాసవిమాత ఆర్యవైశ్యుల ఆత్మాభిమానాన్ని,త్యాగనిరతిని ప్రపంచానికి చాటి చెప్పిందని ఆర్యవైశ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చిట్టిమళ్ళ కృష్ణమూర్తి,
రేవూరి శ్రీనివాస్ ,బోనగిరి శ్రవణ్ కుమార్ ,
బెలిదె పూర్ణచందర్ , ఇమ్మడి అశోక్, గందెసోమన్న, పాలకుర్తి రాజన్న, బజ్డూరి చలమయ్య, దొడ్డ రాజ్ కుమార్ ,సురేష్ ,శ్రీధర్ ,శ్రీను,సతీష్, రవి వాసవి తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »