హార్డ్వేర్ షాపులో చెలరేగిన మంటలు

హార్డ్వేర్ షాపులో చెలరేగిన మంటలు
జ్ఞాన తెలంగాణ న్యూస్
వికారాబాద్ జిల్లా
వికారాబాద్ జిల్లాలోని రామయ్య గూడా రోడ్డు .లో.స్థానికుల సమాచారం మేరకు దానప్ప హాస్పిటల్ పక్కనే ఉన్న నాగలక్ష్మి హార్డ్వేర్ షాపులో శుక్రవారం తెల్లవారుజామున 4గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి..
అదే షాప్ పై ఉన్న ఇంటితో సహా బుడిదగా మారింది అద్రుష్టవశాత్తు ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు.
సమాచారం అందుకున్న సిఐ నాగరాజు వారి సిబ్బంది. మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి రమేష్. ఫైర్ సిబ్బంది అలాగే మున్సిపల్ కార్మికులు. సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు గత ఐదు సంవత్సరాలు క్రితం నాగారం కు చెందిన రాజు అనే వ్యక్తి హార్డ్వేర్ షాప్ పెట్టడం జరిగింది ఒక్కసారిగా షాప్ లో చెలరేగిన మంటలు పూర్తిగా షాప్ దద్ధమైన పరిస్థితి ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు మంటలు అదుపు చేయడంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మరియు మున్సిపల్ సిబ్బంది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ కూడా ఇక్కడ వచ్చి మంట అదుపు చేయడంలో సహకరించారు.