బండారుపల్లిలో ఘనంగా ప్రారంభమైన అఖండ శివనామ సప్తహ.

బండారుపల్లిలో ఘనంగా ప్రారంభమైన అఖండ శివనామ సప్తహ.
జ్ఞాన తెలంగాణ – బోధన్
బోధన్ మండలం బండారుపల్లిలో గ్రామంలో గురువారం అఖండ శివనామ సప్తహ భక్తి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ మేరకు చినమావందికి చెందిన ప్రముఖ అధ్యాత్మికవేత్త రాచప్ప భక్తులను ఉద్దేశించి ప్రసగించారు. లింగాయత్ సమాజ్ ఉద్భవించిన తీరు, శివుడితో ఉన్న అనుబంధాన్ని వివరించారు. నేటి నుండి ప్రారంభమైన అఖండ శివనామ సప్తహ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగుతుందని గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మందిరం పూజారి శంకరప్ప, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నాగనాథ్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షుడు గణేష్ పటేల్, గ్రామ పెద్దలు గోవిందరావు, మారుతి పటేల్, పండిత్ పటేల్, విట్టల్ పటేల్ తోపాటు మహిళలు భక్తులు పాల్గొన్నారు.