పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలి

పెండింగ్లో ఉన్న వేతనాలను మంజూరు చేయాలి
ఐఎఫ్ టి యు, సిఐటియు వినతి…..
జ్ఞాన తెలంగాణ ఖమ్మం మే 16..
ఖమ్మం ప్రభుత్వాఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు, ఈరోజు ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అనంతరం ఐఎఫ్టియు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామయ్య సిఐటియు జిల్లా నాయకులు వై. విక్రం మాట్లాడుతూ మూడు నెలల నుండి స్వీపర్సు పేషంట్ కేర్ గార్డెన్ సెక్షన్ సెక్యూరిటీస్ తదితరు వాళ్ళు పనిచేస్తున్నప్పటికీ మూడు నెలల వేతనాలు ఇవ్వకపోవడం విచారకరమని వారు ఆరోపించారు, కుటుంబాలు కేవలం వేతనాల మీద ఆధారపడి మాత్రమే జీవిస్తున్నారు నగరంలో ఇంటి అద్దె కట్టడంలో గాని నిత్యవసరస్తులు కొనుగోలు చేయాలన్న దుర్భరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారని అధికారులు తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్నటువంటి మూడు నెలల వేతనాలను మంజూరు చేయాలని కోరారు లేనియెడల భవిష్యత్తులో గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి 259 మంది కార్మికులతో నిరవధికంగా సమ్మె చేస్తామని తెలియపరచటం జరిగింది
. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు ఖమ్మం ఏరియా కార్యదర్శి కే శ్రీనివాస్, అంబేద్కర్. జగదీష్, రాందాస్, నాగమణి, ఉపేందర్, సునీత, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.