అదుపుతప్పిన బైకు…..వ్యక్తి అక్కడికక్కడే మృతి


జ్ఞాన తెలంగాణ //సంగారెడ్డి //కొండాపూర్ //మే 16.
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సైదాపూర్ గ్రామ శివారులో సోలార్ ప్లాంట్ మలుపు వద్ద బుధవారం రాత్రి 11 గంటలకు బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో తలకి బలమైన తీవ్రగాయం కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు వివరాల్లోకెళ్తే సైదాపూర్ గ్రామానికి చెందిన పెద్ద గొల్ల అంజయ్య (45) వ్యవసాయం మృతుడికి భార్య ప్రమీల(35)కొడుకు సురేష్(21) కూతురు శ్రావణి(18) ఉన్నారు.
వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన
బుధవారం రాత్రి గంగారం గ్రామంలో బంధువుల ఇంటిలో విందులో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో సోలార్ ప్లాంట్ దాటగానే మలుపు వద్ద బైకు అదుపుతప్పి రోడ్డు ప్రక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అందరితో కలుపుగోలుగా ఉండే అంజయ్య మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర ఛాయాలూ నెలకొన్నాయి.
కుటుంబానికి పెద్ద దిక్కు అయినా వ్యక్తి మృతి చెందడంతో కుటుంబం రోడ్డున పడకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

You may also like...

Translate »