రోజ్ వేణు,సావిత్రిల పెళ్లిరోజు సందర్భంగా ఆర్టీసీ, ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ

కల్లూరు మే 13(నేను తెలంగాణ న్యూస్ ):

రఘునాథ గూడెంలో నివాసం ఉంటు పత్రికా విలేఖరి గా పని చేస్తున్న జానపాటి.రోజ్ వేణు-సావిత్రిల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి కుమార్తెలు (సుష్మ , ఎం బి బి ఎస్ మొదటి,ద్వితీయ సంవత్సరంలలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణురాలు, దీప్తి,ఎం కామ్) ల సౌజన్యంతో సోమవారం కల్లూరు బస్టాండులో ప్రయాణికులకు,ఆర్టీసీ సిబ్బందికి ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.60 రోజులు మజ్జిగ పంపిణీ కార్యక్రమం లో భాగంగా 42వ రోజు ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం పట్ల ప్రయాణికులు,టీం సత్తుపల్లి తరపున కల్లూరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరుల తరపున రోజ్ వేణు -సావిత్రి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పెళ్లి రోజు వేడుకలు మరెన్నో ఆనందంగా సంతోషకరంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ వారి కుమార్తెలు సుష్మ,దీప్తి లు మరెన్నో ఉన్నత చదువులు చదవాలని ఆశిస్తూ, వారికి వారి కుటుంబ సభ్యులకు అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆనందరావు,నాగరాజు,ఆదూ రి ప్రభాకర్,జానపాటి శృతి కీర్తి జస్వంత్ నల్లగట్ల అన్విక్ , ప్రయాణికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...

Translate »