భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ప్రపంచ మేధావి, విద్యార్థి దశలో అంబేడ్కర్ ఉన్నత చదువులు చదివిన మెరిట్ కలిగిన విద్యార్థి.

భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్ ప్రపంచ మేధావి, విద్యార్థి దశలో అంబేడ్కర్ ఉన్నత చదువులు చదివిన మెరిట్ కలిగిన విద్యార్థి.
అగ్రకులాలు వాళ్ళు రిజర్వేషన్లు వలన ప్రతిభ దెబ్బతింటుంది అంటూ కనీస సామాజిక స్పృహ, చారిత్రక అవగాహన లేకుండా సాటి నిమ్నజాతులు బాగుపడటం చూసి అసూయతో రిజర్వేషన్లు వలనే తమకు అన్యాయం జరుగుతుందని లేనిపోని అవాస్తవాలు చెబుతుంటారు. ఈ దేశంలో ఏ ప్రతిభ ఉందని నెహ్రూ ప్రధానమంత్రి అయ్యారు. అంబేడ్కర్ ప్రతిభ ముందు ఈ దేశంలో ఎవరైనా సరితూగ గల వ్యక్తులు ఉన్నారా? నిజంగా ప్రతిభ కలిగిన అంబేడ్కర్ కు ఎందుకు ప్రధానమంత్రి పదవి ఇవ్వలేదు. ఈ ప్రతిభ దెబ్బతింటుంది అనే మాట నిజం కాదు. కాస్త పుస్తకాలు బట్టి కొట్టి మార్కులు తెచ్చుకునే వాళ్ళు చరిత్ర ను రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు అనేది చదవాలి. నాలుగు బిట్లు ,నాలుగు ప్రశ్నలకు జవాబులు చదువుకుని పెద్ద ప్రతిభావంతులన్నట్లు ఫీల్ అయితే అది మీ అజ్ఞానం ,మూర్ఖత్వం తప్ప ఇంకేంటి. 1951 లో భారతదేశ వ్యాప్తంగా స్వాతంత్ర్యానంతరం ప్రజాస్వామ్య రాజ్యం సాధించుకున్న తరుణంలో మొట్టమొదటి సారిగా సాధారణ ఎన్నికలు జరపాలని అధికారికంగా ప్రకటన చేసారు. అక్టోబర్ నెలాఖరున అఖిలభారత నిమ్నజాతుల సమాఖ్య కార్యనిర్వాహక వర్గం ఢిల్లీలో సమావేశం అంబేడ్కర్ సమక్షంలో జరిగింది. ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళిక(ఎలక్షన్ మేనిఫెస్టో)ను రచించాలని అంబేడ్కర్ కు పూర్తి బాధ్యతను అప్పగించారు.అప్పటికే కాంగ్రెసు లో ఉన్న కొందరు నాయకులు కాంగ్రెస్ పార్టీ వదిలి బయటకు రావడం జరిగింది. కాంగ్రెస్ ను వదిలిన వారిలో జయప్రకాష్ నారాయణ్,డా.రామ్ మనోహర్ లోహియా,నరేంద్ర దేవ్,కృపలానీ,అశోక మెహతాలు ఉన్నారు.వీళ్ళు సోషలిస్టు పార్టీను ఏర్పాటు చేసుకున్నారు. అజ్ఞాతంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు సైతం ఎన్నికల్లో పాల్గొన్నాయి. అంబేడ్కర్ తో కలిసి సోషలిస్టు పార్టీ నాయకులు ఎన్నికల్లో పాల్గొన్నారు.అఖిలభారత నిమ్నజాతుల సమాఖ్య కూడా ఒక్క సోషలిస్టు పార్టీ తోనే పొత్తు పెట్టుకున్నారు.
అఖిలభారత నిమ్నజాతుల సమాఖ్య మేనిఫెస్టో లో కూడా ఈ పొత్తు విషయాన్ని కూడా స్పష్టం చేశారు. నిమ్నజాతులు రాజ్యాధికారం దిశగా నడవడానికి అంబేడ్కర్ కృషి చేశారు.మరోపక్క ఎం.ఎన్.రాయ్ నరేంద్ర దేవ్ ,యం.వి.డోండే వంటి మేధావులు కూడా అంబేడ్కర్ రచించిన ఎన్నికల ప్రణాళికకు మద్దతు తెలిపారు. కాశ్మీర్ విషయం లో అంబేడ్కర్ నిర్వహించిన పాత్రకు రాయ్ మద్దతు తెలిపారు. అంబేడ్కర్ ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్ గనుక మళ్ళీ అధికారం లోకి వస్తే భారతదేశం పతనం తప్పదని హెచ్చరించారు.
కాంగ్రెస్ అవినీతి పాలన ,మనువాద పోకడలు పట్ల అంబేడ్కర్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ అధికార అండదండలతో ఎలాగైనా అంబేడ్కర్ ను ఓడించాలని నెహ్రూ బొంబాయి వచ్చి తిష్టవేశారు.సోషలిస్టు పార్టీ లను అంబేడ్కర్ తరపున ఉన్న అఖిలభారత నిమ్నజాతుల సమాఖ్య ప్రతినిధులను ఓడించడానికి కాంగ్రెసు నాయకులు డబ్బు, అధికారం ,పదవులు అన్నీ వాడుకున్నారు.ఎట్టకేలకు తమ అంగ ,అర్థ బలంతో బొంబాయి లో కాంగ్రెసు అత్యధిక మెజారిటీ తో గెలుపొందారు.**అంబేడ్కర్ సోషలిస్టు పార్టీ కు మద్దతు**అంబేడ్కర్ సోషలిస్టు పార్టీకు మాత్రమే మద్దతు తెలిపారు. ఎత్తుగడలు వేసి కాంగ్రెసు ను కూల్చాలని ప్రయత్నం చేసి విఫలం చెందారు. ముంబాయిలో చౌపాటి వద్ద సాయంత్రం జరిగిన ఒక సభలో “భారతదేశానికి స్వాతంత్య్రం సుభాష్ చంద్రబోస్ వలనే వచ్చింది అన్నారు.”**1951 నవంబర్ లో అంబేడ్కర్ కు సోషలిస్టు పార్టీ, అఖిలభారత నిమ్నజాతుల సమాఖ్య సంయుక్తంగా సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ “ప్రజాహిత పాలన కోసం కాంగ్రెస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను అధికారంలోకి తేవాలన్నారు.”**1951 నవంబర్ 25 న అంబేడ్కర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లోని శివాజీ పార్కులో రెండు లక్షల మందితో సభ జరిగింది.ఈ సభలో అంబేడ్కర్ మాట్లాడుతూ “భారతదేశానికి సమర్థవంతమైన ప్రతిపక్షం తప్పనిసరిగా ఉండాలి అని అన్నారు.నెహ్రూ ను సోషలిస్టు పార్టీ లో చేరమని ఆహ్వానించారు.”**ఎన్నికల్లో అంబేడ్కర్ కు ద్రోహం చేసిన భారత కమ్యూనిస్టులు**ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు అంబేడ్కర్ కు అన్యాయం చేశాయి. అంబేడ్కర్ సహజంగానే భారత కమ్యూనిస్టు పార్టీలు యొక్క స్వభావాన్ని గమనించారు.అలాగే కమ్యూనిస్టు సిద్ధాంతం హింసను ప్రేరేపిస్తుంది కాబట్టి ఆయన దుందుడుకు స్వభావాన్ని ,హింసను ఒప్పుకోలేదు.లక్నోలో విశ్వవిద్యాలయ విద్యార్థులను ఉద్ధేశించి అంబేడ్కర్ మాట్లాడుతూ ” నిమ్నజాతుల సమాజం కమ్యూనిస్టు అయిపోయినట్లైతే భారతదేశానికి ఆపద వస్తుంది అన్నారు.” దీంతో కమ్యూనిస్టులు అంబేడ్కర్ ను టార్గెట్ చేయసాగారు.సహజంగానే మనువాద భావజాలం గల కమ్యూనిస్టులు అంబేడ్కర్ పై ద్వేషం పెంచుకున్నారు.తాము చెప్పిందే వినాలి ఇతరులకు ఏమీ తెలీదు మాదే అసలైన జ్ఞానం అనుకునే మనస్తత్వం ఈ దేశంలో ఉన్న మనువాద కమ్యూనిస్టులది. అందుకే అంబేడ్కర్ ను సాధారణ ఎన్నికల్లో ఓడించడం కోసం అవసరం అయితే తమ కుల స్వభావం ప్రకారం కాంగ్రెస్ తో చేతులు కలిపారు. కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృత డాంగే కాంగ్రెస్ నాయకుడు నెహ్రూ తో మిలాఖత్ అవడం జరిగింది. అంబేడ్కర్ కు వ్యతిరేకంగా డాంగే పనిచేసి ఎన్నికల్లో ఆయనకు ఓట్లు రాకుండా చూశాడు. డాంగే ఆ రక్షిత సీట్ల ఓట్లు ఎవరికీ ఇవ్వొద్దని ప్రచారం చేశాడు.అందువల్ల 50 వేల ఓట్లు రద్దు అయ్యాయి.14 వేల ఓట్లతో అంబేడ్కర్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. అంబేడ్కర్ కు పడాల్సిన ఓట్లన్నింటిని కమ్యూనిస్టులు రాకుండా చేశారని అర్థం అయింది. ఈ దేశానికి రాజ్యాంగం రచించిన అంబేడ్కర్, ప్రపంచ మేధావిని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఓడించారు. ఒక రాజకీయ నిపుణుడు అంబేడ్కర్,ప్రజా రాజకీయ నాయకుడు అంబేడ్కర్.ఎన్నికల ఫలితాలు తర్వాత అంబేడ్కర్ ఢిల్లీకి వెళ్ళారు.సాధారణ ఎన్నికల తరువాత 1952 మార్చిలో ముంబాయి శాసనసభ తరపున అంబేడ్కర్ నామినేషన్ వేయడం జరిగింది.17 మంది అభ్యర్థులతో అంబేడ్కర్ ఈ శాసనసభకు ఎన్నికైనారు.ఆ విధంగా అంబేడ్కర్ 1952 మే 13 న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు.అంబేడ్కర్ రాజ్యసభకు ఎన్నికవడం పట్ల భారతదేశం లోని నిమ్నజాతులు ఎంతగానో సంతోషించారు.**1952 మే నెలలో రాజ్యసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంబేడ్కర్ సోవియట్ రష్యా సామ్రాజ్య తత్వాన్ని విమర్శించారు. నెహ్రూ గవర్నమెంట్ పై తీవ్రంగా విమర్శలు చేశారు. నెహ్రూ విదేశాంగ విధానం పూర్తిగా విఫలమైందని నెహ్రూ ప్రభుత్వం తమ తప్పులను సరిచేసుకోకపోతే భారతదేశం నష్టపోతుందని హెచ్చరించారు.**జై భీమ్ జై భారత్*