బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు

బీఆర్ఎస్ కార్యకర్తలపై బీజేపీ దాడి.. ముగ్గురికి తీవ్రగాయాలు

జ్ఞానతెలంగాణ,- అదిలాబాద్ :

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ కార్యకర్తలు బరితెగించారు. జైనూర్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాషాయ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యానికి తెగబడ్డారు.

బీజేపీ కార్యకర్తల దాడిని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలువరించారు. ఇరు పార్టీల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఘర్షణకు దిగిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. ఘర్షణలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

ఈ దాడిలో మీడియా ప్రతినిధుల సెల్ఫోన్లు ధ్వంసమయ్యాయి. ఇక తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులుతీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకూ 24 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు

You may also like...

Translate »