డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను పరిశీలించిన ఎన్నికల సాధారణ పరిశీలకురాలు.
జ్ఞాన తెలంగాణ – బోధన్ టౌన్
పార్లమెంటు ఎన్నికల సంధర్బంగ బోధన్ పట్టణంలోని విజయమేరి పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఆదివారం ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఐఏఎస్ అధికారిణి అలియావిజ్ పరిశీలించారు. ఎన్నికల విధులకు హాజరయిన ఉద్యోగులు ఎన్నికల విధులలో రిపోర్ట్ చేయడం, గైర్హాజరయిన వారి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలతో విధులకు బయలుదేరిన వాహనాలకు ఎస్కార్ట్ ను పకడ్బందిగా వ్యవహరించాలని సూచించారు. నియోజకవర్గంలోని ఓటర్ల సంఖ్య, పోలీంగ్ బూత్ ల సంఖ్య, సమస్యాత్మక పోలీంగ్ కేంద్రాల గురించి ఆమే రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు.వంద శాతం పోలీంగ్ నమోదు అయ్యేలా ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు.ఆమే వెంట ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్ ఉన్నారు.