నేడు కామ్రేడ్ సుంతనోళ్ళ రామప్ప రెండవ వర్ధంతి.:
నేడు కామ్రేడ్ సుంతనోళ్ళ రామప్ప రెండవ వర్ధంతి.:

ఙ్ఞాన తెలంగాణ ,నారాయణ పేట టౌన్ మే 12:
శత్రువునైన ప్రేమించే మంచి గుణమున వ్యక్తి.ఆకలి అని వచ్చిన వారికి అన్నం పెట్టిన మనిషి.
ఇక్కడ అన్యాయం జరిగిన ప్రజల మనుషుల మధ్యన ఉండి పోరాడే నాయకుడు .
శత్రువుని కూడా ప్రేమతో దగ్గరకు తీసుకొని తన సమస్యకి పరిష్కారం అందించే మరొక నక్షత్రం.
ఆపదలో వుండి అన్నా అని పిలిచే పిలుపుకు అనుక్షణం నిరుపేదల వెంట ఉంటూ న్యాయానికి ధైర్యాన్ని అందించే మరొక ధైర్యం.
ఆపదలో ఉన్న వాళ్లకు ఎంతో మందికి ఆ చేయితో సహాయం చేసిన మనిషి మా నాన్న.తను జీవించినంత కాలం ఆ చేయితో ఒకరికి సాయం చేయడమే తప్ప.ఒకరికి హాని కలిగించాలి అనే ఆలోచనని కూడా తన దరిదాపులోకి రానీయని మనిషి.ముక్కు సూటితనం.ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడే వ్యక్తి.ఉడ్మల్ గిద్ద గ్రామంలో ఎవరికి ఏ సమస్య ఉన్న.ఏ పంచాయతీ వచ్చిన పరిష్కరించడంలో ఊరు పెద్దమనుషులలో మా నాన్న పాత్ర కూడా కీలకంగా ఉండేది.తను జీవించిన జీవితకాలంలో సగ జీవితం ఊరికే అంకితం చేసిన వ్యక్తి. మనిషి పుట్టడం చావడం సహజమే.కానీ బతికిన జీవితకాలంలో ఏమి సాధించమన్నదే చిరస్థాయిగా నిలిచిపోతది.
భౌతికంగా నువ్వు మా మధ్యన లేకపోయినా నీ జ్ఞాపకాలు చిరస్థాయిగా మాతోనే ఉంటాయి నాన్న.
మా నాన్న బోతికంగా మాకు,మనకు దూరమై రెండు సంవత్సరాలు అయింది.మా నాన్న రెండవ వ వర్ధంతి సందర్భంగా విప్లవ తెలంగాణ సామజిక జోహార్లు అర్పిస్తూ పిడిఎస్ యు నారాయణపేట జిల్లా అధ్యక్షులు సాయికుమార్ తెలుపుతూ ప్రజా సమస్యల కొరకై నిరంతరం పోరాడే వ్యక్తికి జోహార్ జోహార్ అన్నారు.