ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా..

ఎంపీగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా..
కాంగ్రెస్ బిజెపి మోసపూరిత హామీలకు నమ్మకండి. ఫోటో. సాలూరలో రోడ్ షోలో మాట్లాడుతున్న బాజిరెడ్డి గోవర్ధన్. జ్ఞానతెలంగాణ – బోధన్ తాను ఎమ్మెల్యేగా చేసినప్పుడు బాన్సువాడ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశానని అలాగే మళ్ళీ ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో మీ అందరి సమస్యలు లేవనెత్తి నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు తెస్తానని బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శనివారం ఆయన సాలూర మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద నిర్వహించిన రోడ్ షోలో, కుమ్మన్ పల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు పేరుతో ప్రజలకు ఇచ్చిన హామీలను ఆరు నెలలైనా అమలు చేయలేదని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. నేడు రైతులకు, నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ఎందరో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ మోసపూరిత హామీలతో ఎంపీగా గెలిచి జిల్లాకు ఆయన చేసింది ఏమీ లేదని అన్నారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ,ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ధర్మపురి అరవింద్ ను ఎంపీగా గెలిపించారని అలాంటి మోసగాళ్ల మాటలు నమ్మరాదని అన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టానని అలాగే బోధన్ నియోజకవర్గంలో డి-47 నిజాం సాగర్ కెనాల్ ను అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు.సాగర్ కెనాల్ లైనింగ్ పనులను 80 కోట్లతో చేశానన్నారు.టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులుగా ఉన్న స్వర్గీయ బుద్ది రాజేశ్వర్ అకాల మరణం చెందడం పార్టీకి తీరని లోటు ఆయన అభిమానులుగా టిఆర్ఎస్ ను ఆదరించాలని అన్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ గంగారెడ్డి , ఆయేషా ఫాతిమా, వైస్ ఎంపీపీ కోట గంగారెడ్డి, సాలూర ముఖ్య నాయకులు వెంకటిపటేల్, నూర్ ఆహ్మద్, అమీర్, చింతం నాగయ్య , దత్తు,నాయకులు పాల్గొన్నారు.