ఏరాజ్ పల్లిలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) నాయకుల ఇంటింటి ప్రచారం

ఏరాజ్ పల్లిలో కాంగ్రెస్, సీపీఐ(ఎం) నాయకుల ఇంటింటి ప్రచారం
జ్ఞాన తెలంగాణ- బోధన్
బోధన్ మండలం ఎరాజ్ పల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ(ఎం) పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో చెరువులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే ప్రతి ఒక్కరికి 6 గ్యారంటీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. కావున కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. గత పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోవడంలో పరిష్కారం చేయడంలో విఫలమయ్యారని అన్నారు. రాష్ట్ర ఎన్నికలలో టిఆర్ఎస్ కు ప్రజలు బుద్ధి చెప్పి పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో ఉన్న బిజెపికి కూడా బుద్ధి చెప్పాలని కోరారు. దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయిన కాంగ్రెస్ పార్టీని వామపక్ష పార్టీలను ప్రజలు గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో సిపిఐ ఎం పార్టీ బోధన్ ఏరియా కమిటీ సభ్యులు బాలయ్య కుప్రియాల, ఆసరి లింగం, దర్జీ శ్రీనివాస్, లాయర్.గంగారెడ్డి , సాయ రెడ్డి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
