పెగడపల్లిలో బి ఆర్ ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం

పెగడపల్లిలో బి ఆర్ ఎస్ నాయకుల ఇంటింటి ప్రచారం
జ్ఞాన తెలంగాణ- బోధన్
బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఎంపీ అభ్యర్థిగా విజయం సాధిస్తే జిల్లాలోని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉందని కావున బాజిరెడ్డి గోవర్ధన్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో టిఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్. కురుమ సంఘం మండల అధ్యక్షులు మేడి రవి, సుదర్శన్ రెడ్డి, రాజు, కమలాకర్, రామయ్య, మేత్రి పోశెట్టి, భూమరెడ్డి, నారాయణ చారి, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
కోట్ చేసిన టెక్స్ట్ను చూపండి
