కారు గుర్తును గెలిపించాలని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైకు ర్యాలీ

బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ జ్ఞానతెలంగాణ చిట్యాల మే 10:బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుధీర్ కుమార్ కార్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ నేడు శుక్రవారం మాజీ స్పీకర్ ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి ఆదేశంతో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చింతల రమేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చిట్యాల మండలంలోని కైలాపూర్ చింతకుంట రామయ్య పల్లి నవాబుపేట వేలేటి రామాయపల్లి చిట్యాల క్రొసరుపల్లి తిరుమలపూర్ జూకల్లు చల్లగరిగె ముచినిపర్తి గోపాలపూర్ కొత్తపేట బావు సింగ్ పల్లి జడల్ పేట తదితర గ్రామాలలో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి మోసపూరితంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ బైక్ ర్యాలీ నిర్వహణ చేసారు . ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో చింతల రమేష్ ముదిరాజ్ మాట్లాడుతూ గడిచిన 10 సంవత్సరాలో అనేక అభివృద్ధి పనులు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల కాలంలో బీ ఆర్ఎస్ పార్టీని నిందించడం శాపనార్ధాలు పెట్టడం తప్ప అభివృద్ధి పై ప్రజా సమస్యలపై దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారము రెండు లక్షల రుణమాఫీ ఇంతవరకు జరగలేదని మహిళలకు 2500 రూపాయలు ఇప్పటివరకు చెల్లించలేదని 57 సంవత్సరాలు దాటిన వృద్ధులకు విత్తంతువులకు వికలాంగులకు బీడీ కార్మికులకు 2000 నుంచి 4 వేలకు పెంచిన పెన్షన్ పథకం ఇప్పటివరకు అమలు చేయలేదని ఆయన విమర్శించారు. కల్యాణలక్ష్మి ద్వారా చెల్లించే లక్షతో పాటు తులం బంగారం ఇస్తానన్న మాట ఉత్తితే అయిందని కేసీఆర్ కిట్టును పక్కకు నెట్టేసారని రైతు బంధు పథకం ద్వారా 15000 ఇస్తానన్న మాట పూర్తిగా మోసపూరితమని ఆయన అన్నారు. రైతులను ఆదుకోవడంలో, పంటలను కాపాడడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని. సాగునీరు లేక వేల ఎకరాలలో పంటలు పూర్తిగా ఎండిపోయాయని ఆయన ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. కరెంటు కోతలు పెరిగిపోయి రైతులకు రుణ భారం పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ పార్టీ కి మాత్రమే సాధ్యమవుతుందని కెసిఆర్ అందుకు పూర్తిస్థాయి సమర్ధుడని ఆయనలాగా అభివృద్ధి చేసే సత్తా సామర్థ్యం తెగువ అంకితభావం ఎవరికి లేవని రమేష్ ముదిరాజ్ తెలిపారు ముందు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీ పదవికి పోటీ చేస్తున్న సుధీర్ కుమార్ కారు గుర్తుకే ఓటు వేసి భారీ మెజారిటీతో వారిని గెలిపించితేనే కేంద్రం నుండి మనకు రావలసిన వాటాను సక్రమంగా తీసుకుంటామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా, మండల పార్టీ నాయకులు జంబుల చంద్రమౌళి స్కైలాబ్ తీగల బాలకృష్ణ కంచర్ల కుమారస్వామి కొత్త శ్రీనివాస్ గొల్లపల్లి రాజు కోడెల రాజమల్లు కోడెల నందయ్య భయగాని గణపతి బొట్ల రవి కాట్రేవుల రాజయ్య కుమార్ నల్ల నవీన్ నల్ల అశోక్ గోపగాని నరేష్ ఓదెల నరేష్ తుమ్మల రాజు పవన్ కలికోట సుదర్శన్ రత్న మొగిలి రత్న శ్రీనివాస్ బోనగిరి సది బండారి రమేష్ గణేష్ మానుకొండ శ్రీకాంత్ గొల్లపెల్లి సురేష్ బనగాని సదయ్య తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »