మహాత్మా బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త .


–సాలూరలో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి.

జ్ఞానతెలంగాణ – బోధన్
మహాత్మ బసవేశ్వర మహారాజ్ జయంతి వేడుకలను శుక్రవారం సాలూర మండల కేంద్రంలో లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లింగయ్య సమాజ్ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం లింగాయత్ సమాజ్ నాయకులు మాట్లాడుతూ బసవేశ్వరుని ఆశయాలు ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని అన్నారు. అనంతరంవిగ్రహం ఎదుట కాషాయ జెండాను వీర శైవ లింగాయత్ సమాజ్ గ్రామ అధ్యక్షుడు శివపూజ శంకర్ ఆవిష్కరించారు.బసవేశ్వరుడు గొప్ప సంఘ సంస్కర్త , దార్శినికుడని సమాజ్ ప్రతినిధులు అన్నారు.కార్యక్రమంలో సమాజ్ ప్రతినిధులు గంటే వీరేశ్,బండే శివరాజ్, కాసిరెల్లి హన్మంత్ రావు, భుయ్యన్ సురేష్, శివప్ప పటేల్ , రాజు పటేల్ ,సొసైటీ సీఈవో బసవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »