కాసాని గెలుపు పక్క

కాసాని గెలుపు పక్క
జ్ఞాన తెలంగాణ చేవెళ్ల మే 09 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తరపున చేవెళ్ల మండలం కందవాడ గ్రామంలో ఎంపిటిసి కావలి రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా టిఆర్ఎస్ చేవెళ్ల మండల పార్టీ అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ మాట్లాడుతూ కాసాని ముదిరాజ్ ముద్దుబిడ్డ బహుజనవాది కులాల అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అని,ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కందవాడ ఎంపీటీసీ కావాలి రవీందర్ యాదవ్ మాట్లాడుత మనం నెంబర్ నంబర్ వన్ గుర్తుకు అందరూ ఓటెయ్యాలి సమస్యలు మన కష్టాలు మన బాధలు అన్నీ తీరేలా కొండంత ధైర్యాన్ని,చేయూతనిచ్చే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని అని అన్నారు. ప్రజలందరూ ఆలోచించి మే 13న జరిగే ఎన్నికల్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేసి మన అందరి బంధువు కాసాని జ్ఞానేశ్వర్ ను ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కందవాడ కో ఆప్షన్ నెంబర్ కురువ మల్లేష్ మాట్లాడుతూ అన్నా అని పిలిస్తే నేనున్నాను అని పలికే పేద ప్రజల ఆత్మబంధువు కాసాని జ్ఞానేశ్వర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు కావాలి పాండు యాదవ్ మాట్లాడుతూ మన గ్రామం అభివృద్ధి చెందాలంటే బి ఆర్ ఎస్ పార్టీని కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించుకోవాలని అన్నారు. చేవెళ్ల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో బీసీల బిడ్డ బహుజన రాజధికారంతోపాటు పాటు బీసీల ఐక్యత కోసం పోరాడిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కందవాడ గ్రామ సీనియర్ నాయకులు. బండ యోహన్,రంజిత్ కుమర్ గిరిగల్ల అరుణ్ కుమార్ కమ్మరి శివకుమార్,నర్సింలు, హరీష్ గౌడ్ మోడంపల్లి వెంకటేష్, కుర్వ జనార్ధన్ బీరప్ప నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు