అటవీశాఖ అధికారుల వేధింపులపై తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

అటవీశాఖ అధికారుల వేధింపులపై తాహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

కాగజ్ నగర్ మండలం మోసం గ్రామపంచాయతీ పరిధిలో గల సర్వే నంబర్ 72 శివార్ లో గల రైతులు శుక్రవారం తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ శివారులో మోసం, ఆరెగూడ గ్రామాల చెందిన సుమారు 200 మంది రైతులు తమ భూముల్లో వ్యవసాయం సాగు చేసుకుంటున్నారు. కానీ అటవీశాఖ అధికారులు ఈ భూములు తమవని, ఇక్కడ రైతులు ఎలాంటి సాగు చేసుకోరాదని వేధిస్తున్నారని, ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ప్రభుత్వం నుంచి పంపిణీ చేసిన పట్టా పాసుబుక్కులు ఉన్నాయని వారు తెలిపారు. ధర్నా చేస్తున్న రైతులతో తాహసిల్దార్ మాట్లాడారు. ఎన్నికల తర్వాత రెవెన్యూ ,అటవీశాఖ అధికారులు కలిసి సంయుక్త సర్వేలు నిర్వహించి న్యాయం చేస్తామని రైతులకు తాహసిల్దార్ కిరణ్ కుమార్ తెలిపారు. దీంతో రైతులు ఆందోళన విరమించారు.

You may also like...

Translate »