డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రచారం

డాక్టర్ సుధీర్ కుమార్ గెలుపే లక్ష్యంగా ప్రచారం
బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్.
జ్ఞాన తెలంగాణ టేకుమట్ల.
టేకుమట్ల మండలం ఏంపేడు, ఆరేపల్లి గ్రామలలొ బి ఆర్ ఎస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు సట్ల రవి గౌడ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సట్ల రవి గౌడ్ మాట్లాడుతూ మే13న జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వరంగల్ పార్లమెంట్ బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి డా.సుధీర్ కుమార్ కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యక్తి,తొలి ముఖ్యమంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వ్యవస్థాపకులు కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమం కొరకు,రాష్ట్ర అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసి కళ్యాణ లక్ష్మీ,అపర భగీరథుడై అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి రాష్ట్రం మొత్తం గోదావరి జలాలను పారించి బీళ్లు బారిన పొలాలను పచ్చని మాగాణి చేసి అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనుడు మన కేసీఆర్,
10 ఏండ్ల పరిపాలన ఎంతో మార్పు తీసుకొని వచ్చారు,
ఆనాడు సమైక్య ఆంధ్రలో కరెంటు కష్టాలు చూసినం, రైతు ఆత్మహత్యలు చూసినం కానీ కేసీఆర్ రైతుల సంక్షేమం కొరకు 10000/- రూపాయల పంట సహాయం,5 లక్షల రూపాయల రైతు భీమా, 24 గంటల నాణ్యమైన కరెంట్,గోదావరి జలాలను ప్రతి ఇంటికి,ప్రతి గుంటకు అందించారు అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో ఏంపేడు గ్రామ తాజా మాజీ సర్పంచ్ కొలిపాక రాజయ్య, ఉపసర్పంచ్ లాడే నిర్మల రవీందర్, వార్డు నెంబరు పొనగంటి బాబు,ఆరేపల్లి గ్రామ అధ్యక్షుడు గువ్వాడి శివ, గువ్వాడి లక్ష్మణ్ ,సాంబశివరావు గడ్డి గోపాల్,
యూత్ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.