ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్తలు చేపట్టాలి. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్.

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా జాగ్రత్తలు చేపట్టాలి. అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్.
సాలూరలో పోలింగ్ బూత్ ను పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ .జ్ఞాన తెలంగాణ- బోధన్ పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా నిర్వహించేలా జాగ్రత్తలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ సూచించారు గురువారం ఆయన సాలూర మండల కేంద్రంలోని పోలింగ్ బూత్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఓ లకు, స్థానిక గ్రామపంచాయతీ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు . అనంతరం ఆయన బోధన్ పట్టణంలోని విజయమేరీ పాఠశాలలో ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమును పరిశీలించారు. ఆయన వెంట బోధన్ తహసిల్దార్ గంగాధర్, ఆర్ ఐ గంగాధర్, తదితరులు ఉన్నారు.