ప్రజాస్వామ్యాన్ని కాపాడండి:

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 9:

దామరగిద్ద మండలం ఉడ్మలగిద్ద గ్రామంలో ఇండియా కూటమి బలపరిచిన మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గారిని గెలిపించాలని సీపీఎం , కాంగ్రెస్ నాయకులు డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది.సిపిఎం నాయకులు గోపాల్ మాట్లాడుతూ మతతత్వ పార్టీ బిజెపి పార్టీ సామాజిక న్యాయాన్ని కాపాడే ప్రయత్నం చేయకుండా ,రాజకీయన్ని నడివీధిన ఈడ్చి రోడ్లపైకి వచ్చి మతాల మధ్య, కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడితే ఓట్లు అడగడానికి తిరుగుతున్నారు. జాగ్రత్తగా ఉండాలి మనువాద ముఖాలతో మాయలో పడకుండా, మనుషులను సమానత్వంతో చూడకుండా ఎన్నో అరాచకాలు, ఆడవాళ్లపై అత్యాచారలు జరుపుతూ వీధిలో దర్జాగా తయారవుతున్నారు. గత పది సంవత్సరాల పాలనలో నిరుద్యోగం ,విద్య ,వైద్యం, పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకొని ఓట్ల దారి గుండా వస్తుందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఇండియా కూటమికి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఇంటింట ప్రచారం చేస్తూ గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

You may also like...

Translate »