కాంగ్రెస్ లక్ష్యం.. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం

కాంగ్రెస్ లక్ష్యం.. పేద ప్రజల అభివృద్ధి, సంక్షేమం
- పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయి
- రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం
- మన ఇంటి ఆడబిడ్డగా కడియం కావ్యను ఆదరిద్దాం
చిట్యాల మండలం:
ఈరోజు చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్లకొండ కుమార్ అధ్యక్షతన యూత్ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాటాడుతూ… పదేళ్ల పాలనలో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశారని ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని మార్చుతారని, రిజర్వేషన్లు మార్చే కుట్ర జరుగుతుందన్నారు. మన దేశం కోసం గాంధీ కుటుంబం సర్వం త్యాగం చేసిందని, ఇప్పుడు ఆ కుటుంబం నుండి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానిని చేయాలని
కోరారు.
13- 05-2024 రోజున జరగబోయే
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఈ సమావేశంలో యూత్ ముఖ్య నాయకులతో పాటు చిట్యాల మండలంలోని ఆయా గ్రామాల యూత్‌కమిటీ నాయకులు పాల్గొన్నారు.
అల్లకొండ కుమార్
కాంగ్రెస్ పార్టీ చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు
