బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన నవాబుపేట్ మండలం బీజేవైఎం ఉపాధ్యక్షుడు బుచ్చిరాం

జ్ఞాన తెలంగాణ న్యూస్//వికారాబాద్ జిల్లా//నవాబు పేట్ మండలం ఈరోజు చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎల్లకొండ గ్రామానికి చెందిన నవాబుపేట మండలం బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు బుచ్చిరాం దేవుడి పేరుతో మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నటువంటి బిజెపి పార్టీ సిద్ధాంతాలు నచ్చక భాజాపాకు రాజీనామా చేశానని బుచ్చిరాం తెలిపాడు అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపాడు ఈ కార్యక్రమంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ చింపుల సత్యనారాయణ రెడ్డి చేవెళ్ల నియోజకవర్గం బూత్ లెవల్ ఏజెంట్లకు కోఆర్డినేటర్ కొమ్మిడి వెంకటరెడ్డి నవాబు పేట మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొండల్ యాదవ్ చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి భానురి ఉపేందర్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రామచంద్రారెడ్డి ఎల్లకొండ వార్డు సభ్యులు కావలి పరమేష్ యాదవ్, హైమద్ భాయ్, నవాబు పేట్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బెగరి ఆనందం తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »