నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న వేములవాడ ప్రాంతీయ దవాఖాన సిబ్బంది

వేములవాడ
నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేస్తున్న వేములవాడ ప్రాంతీయ దవాఖాన సిబ్బంది
నిన్న జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని ప్రభుత్వ దవాఖానాలో పనిచేస్తున్న సిబ్బందిపై కొంతమంది విధులకు ఆటంకం కలిగించి వైద్యులపై దాడి చేసినందుకు నిరసన గా సోమవారం వేములవాడ ప్రాంతీయ దావాఖానాలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్యులపై సజీవ దహనానికి ప్రయత్నం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ సంఘం తరఫున డిమాండ్ చేసారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపర్ ఇండెంట్ ఆర్ మహేష్ రావు, డాక్టర్లు తిరుపతి, సంతోష్ చారి, అనిల్ కుమార్, సుభాషిని మరియు పలువురు వైద్యులు పాల్గొన్నారు.