పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించండి –ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బండపల్లి రాజన్న

జ్ఞాన తెలంగాణ- బోధన్ త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి బీజేపీని ఓడించాలని ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి బండపల్లి రాజన్న అన్నారు .సోమవారం బోధన్ పట్టణంలోని రైస్ మిల్లర్స్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తామని బిజెపి పార్టీ గత పది సంవత్సరాలుగా హామీ ఇచ్చి మోసం చేసిందని అన్నారు. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన విశ్వరూప మహాసభలో సైతం ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొని ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని హామీలిచ్చి మోసం చేశారన్నారు . 2014 ఎన్నికలలో అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేసి పెడతామని హామీ ఇచ్చిన బిజెపి పార్టీ 10 సంవత్సరాలు గడిచిన కూడా ఎస్సీ వర్గీకరణ పట్ల నిర్లక్ష్యం వహించి మాదిగలను మోసం చేసిందన్నారు. ఎమ్మార్పీఎస్ కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి మద్దతుగా నిలిచిన కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి రెండు పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా మాదిగలను మోసం చేసిందని ,మరొక్కమారు మాదిగల వద్దకు బిజెపి ఓట్లు అడగడానికి వస్తుంది మళ్ళీ అధికారంలోకి వస్తే వర్గీకరణ చేసి పెడతామని మోసపూరితమైనటువంటి హామీతో మాదివాడలోకి రావడం సిగ్గుచేటని ఇకనైనా మాదిగలు మేలుకొని బీజేపీని ఈ ఎన్నికలలో ఓడించాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా కోఆర్డినేటర్ డల్లా సురేష్, బోధన్ నియోజకవర్గ నాయకులు పానుగంటి సాయిలు, గంగాధర్ , సాయిలు , శ్రీనివాస్ , ఎర్రోళ్ల పోశెట్టి, నడిపి సాయిలు, వెంకటరమణ , సంజయ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »