మీ ఊరి రైతు బిడ్డను ఆశీర్వదించండి..

  • నేనేంటో మీకు తెలుసు
  • మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటా
  • ఎంతో అభివృద్ధి చేశా
  • మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తా..
  • బలపాల గ్రామస్తుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు

జ్ఞాన తెలంగాణ మే5, ఖమ్మం జిల్లా ప్రతినిధి: మీ మధ్య పుట్టి పెరిగిన వాన్ని…నేనేంటో మీకు తెలుసు..మీ ఆత్మీయతను మర్చిపోలేను.. మీకు సేవ చేసి ఋణం తీర్చుకుంటాను.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తనకు సహకరించి మీ రైతు బిడ్డను మంచి మెజార్టీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ది నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మంలోని సప్తపది ఫంక్షన్ హాలులో బలపాల గ్రామస్తులతో ఆత్మీయ సమావేశం జరిగింది. నామ పాల్గొని, వారితో మామేకమై ఆత్మీయతను, తీపి గుర్తులను, గత స్మృతులను వారితో పెనవేసుకున్న అనుభూతులను పంచుకున్నారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ బలపాల రైతు బిడ్డగా 25 ఏళ్ల తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని అన్నారు. దేశంలో ఏ ఎం.పీకి దక్కని గౌరవం తనకు దక్కిందని చెప్పారు. పార్లమెంట్ కు అత్యధిక రోజులు హాజరై, ఎక్కువ ప్రశ్నలు అడిగి ఉత్తమ పార్లమెంటేరియన్ గా అరుదైన గుర్తింపు పొంది బలపాల, ఖమ్మం జిల్లా ఖ్యాతిని దేశం నలు మూలల వ్యాపింప జేశానని తెలిపారు. రెండు సార్లు ఎంపీ గా ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ ఒకసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు.ఆలివికాని హామీలతో మోసగించిన కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం నేర్పి, తనను గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో ఉంటున్న బలపాల గ్రామస్తులుతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ కన్వీనర్ జి. వీరభద్రం, భాగం కోటేశ్వరరావు,నామ సైదులు, దేవరపల్లి ఏకాంబరరావు, ముండ్ల రమేష్, నెల్లూరి చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »