రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ..క్లాసిక్ జిమ్ లో ప్రచారం చేసిన విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రిత

రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ..క్లాసిక్ జిమ్ లో ప్రచారం చేసిన విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రిత
జ్ఞాన తెలంగాణ మే5,ఖమ్మం జిల్లా ప్రతినిధి: ఖమ్మం నగరంలోని ఇల్లందు రోడ్డు( సర్దార్ పటేల్ స్టేడియం ఎదురుగా) లో గల క్లాసిక్ జిమ్ ను సినీ హీరో విక్టరీ వెంకటేష్ కుమార్తె అశ్రిత, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమార్తె స్వప్ని రెడ్డి, మంత్రి పొంగులేటి అల్లుడు, రఘురాం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డిలు శనివారం రాత్రి సందర్శించారు. సిపిఐ, సిపిఎం పార్టీ బలపరిచిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిమ్ లో కలియ తిరుగుతూ జిమ్ చేస్తున్న వారిని ఆప్యాయంగా పలకరించారు. జిమ్ వాతావరణం తో పాటు ఎంతో అడ్వాన్స్ గా వ్యాయామ పరికరాలు ఉన్నాయని జిమ్ నిర్వాహకులు మనోజ్ కుమార్, నగీన ను అభినందించారు.