అరుణోదయ రామారావు ఆశయ సాధనకై పోరాడుదాం :

జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్, మే 5: నారాయణపేట జిల్లా కేంద్రంలో భగత్ సింగ్, సిపిఐ(ఎంఎల్)మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో రామారావు 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల లేసి నివాళులర్పించడం జరిగింది.బిజెపి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా. అరుణోదయ రామారావు పూర్తితో. పోరాడుదమని, అరుణోదయ జిల్లా అధ్యక్షులు రాములు మాట్లాడుతూ సంస్థని ఇంటి పేరుగా మార్చుకున్న కామ్రేడ్ సత్యం అరుణోదయ రామారావు గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుపరిచితమే.ఆయన గొంతు ఎత్తితే గోదావరిలోయ ప్రతిధ్వనించింది.వీర గాథలు పాడి యువతను విప్లవూన్ముకుల్నిచేశాడు. ఉయ్యాలో జంపాలో పాడి విద్యార్థుల్ని యూనివర్సిటీ నుంచి వీధుల్లోకి తీసుకువచ్చాడు.ఆయన పాట డప్పు మోత ఎప్పటికీ సజీవంగా బతికుంటయని,జీవితాన్ని ప్రజా ఉద్యమాలకే అంకితం చేసిన వ్యక్తి రామారావు,ఆయన స్ఫూర్తితో బీజేపీ,ఆర్ఎస్ఎస్ ఫ్యాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎల్ఐసి, రైల్వే,రిలయన్స్ ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వాళ్లకు అప్పనంగా అప్పజెప్పిన పరిస్థితి ఉన్నది.పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతున్నా సందర్భంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమీ అధికారాలోకి రావడం కోసం హిందూ,ముస్లిం,క్రిస్టియన్స్ కుల మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న పరిస్థితి. బీజేపీ,ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమిని ఓడించాలని,ఇండియా కూటమిని బలపరచాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా నాయకులు లక్మి,నరసింహ,నాయకులు రాము,సాయికుమార్,గౌస్,మారుతి,వెంకటేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »