అర్హత కలిగి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలిసెక్టార్

అర్హత కలిగి ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలిసెక్టార్
అధికారి డాక్టర్ పరశురాములుజ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్)అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని రాజేంద్రనగర్ సెక్టార్ అధికారి పరుశురాములు తెలిపారురంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శనివారంరంగారెడ్డి జిల్లాకలెక్టర్, రిటర్నింగ్ అధికారి & రాజేంద్రనగర్ ఆర్ డివో & ఏ ఈ ఆర్ ఓ ఆ దేశాల మేరకు ఈరోజు రెండవ విడుత పోలింగ్ కేంద్రాలను దర్శించి ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సదుపాయాలు కల్పించడం గురించి పర్యవేక్షణ చేయడం జరిగింది.ఈ సందర్భంగా పరశు రాములు మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో , పోలీస్ అధికారి నరసింహ, బూతు లెవల్ అధికారులు, నవనీత, అరుణ, భారతి భాయి, సుకన్య, యాదగిరి, చంద్రయ్య పాల్గొన్నారు. పర్యవేక్షణలో భాగంగా ఆయా ప్రాంతాలలో ఎన్నికల ఓటర్ల స్లిప్పులను కూడా ఓటర్లకు పంపిణీ చేశారు.