మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీనీ,ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమిని ఓడించండి.

మతోన్మాద ఫాసిస్ట్ బీజేపీనీ,ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమిని ఓడించండి.

ఇండియా కూటమిని బలపరచండి. :ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ మే 3: నారాయణపేట జిల్లా కేంద్రంలోనీ కూరగాయల మార్కెట్ లో ప్రచారంచేస్తూ కరపత్రాలు పంచడం జరిగింది.ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ జిల్లా కార్యదర్శి బి.రాము మాట్లాడుతూ 18వ లోక్సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రచార జోరు అందుకున్నది. పోలింగ్ దశలు ఆరంభమయ్యాయి.ఈ ఎన్నికలు ఇన్నేళ్ళుగా జరిగినట్లుగా, సాధారణంగా జరుగుతున్న ఎన్నికలు కావు. ఎవరో ఒకరిని ఎన్నుకోవాల్సిన సాధారణ స్థితిలో జరిగే ఎన్నికలు కావు. క్లిష్టపరిస్థితులలో,అత్యంత ప్రత్యేక పరిస్థితులలో జరిగే ఎన్నికలు.ఈ ఎన్నికలు మనముందు ఒక కీలకమైన పరీక్షను ఉంచిన పరిస్థితి.ఆ పరిక్ష దేశంలో వున్న పరిమితమైన బూర్జువా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా? రక్షించుకోవాలా? లేదా మనువాదపు,ఫాసిస్టు విధానానికీ,మతోన్మాద నరరూప హింసాకృత్యానికి అధికారం అప్పగించాలా? అనేది ఆలోచించాల్సిన పరిస్థితి నేడు ఉన్నది. రాజ్యాంగం,ప్రజాస్వామ్యం,ప్రాథమిక హక్కులు,ఓటింగ్,ఎన్నిక ఎంత బలహీనంగా వున్నా,ప్రజలకు దానిలో నుంచి మెరుగైన లౌకిక, ప్రజాస్వామిక విలువలను పెంపొందించుకోవాలనే ఆశ వుండేది.ప్రజాస్వామిక హక్కులకు వ్యతిరేకమైనది.ముస్లిములు,క్రిస్టియన్లు మాత్రమే దానికి శతృవులు కాదు. హిందువులలోని 80 శాతం దళిత,ఆదివాసీ, పేద,బలహీన వర్గాలకు వ్యతిరేకమైనది.దాని కోసం వారిలో మెజారిటీ మత ఉన్మాదాన్నీ, విద్వేషాగ్నినీ,ఉద్వేగాన్నీ కలిగిస్తున్నది. వాస్తవంగా బీజేపీ,ఎన్డీఏ కూటమి అనుసరించిన ఆర్థిక,రాజకీయ విధానాలన్నీ ఈ దేశంలోని అన్ని మతాలలోని,అన్ని కులాలలోని 90 శాతం ప్రజలకు వ్యతిరేకమైనదని.అంబానీ,ఆదానీ లాంటి కార్పోరేట్ వాళ్లకు ప్రయోజనం కలిగించేవి. వీరి హయాంలో దేశంలో 1% ధనికుల చేతిలోకి 40% సంపద పోగుపడుతున్నది.10 శాతం ధనవంతుల చేతుల్లోకి 80 శాతం సంపద పోగవుతున్నది.తీవ్ర అంతరాలను సమాజంలో పెంచుతూ,మత ప్రాతిపదికగా, ప్రజలను చీల్చి తమ ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపెట్టు కుంటున్నది. నిత్యావసరాలైన గ్యాస్,పెట్రోల్ ధరలు పెంచింది.జీఎస్టీతో చిన్న పరిశ్రమలను దెబ్బ తీసింది.అవినీతిని తారాస్థాయికి తీసుకెళ్లిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. మతోన్మాద ఫాసిస్టు నిదానలను అనుసరిస్తున్న బిజెపి,ఆర్ఎస్ఎస్ ఎన్డీఏ కూటమిని ఓడించాలని,ఇండియా కూటమినీ బలపరచాలని ప్రజలు ప్రజాస్వామ్యవాదులు అటువైపు ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ డివిజన్ కార్యదర్శికె.కాశీనాథ్,టౌన్ కార్యదర్శి కెంచె నారాయణ,ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బి.నరసింహా,పార్టీ టౌన్ నాయకులు సలీం,శివాజీ,నజీర్ అరుణోదయ జిల్లా అధ్యక్షులు రాములు,పిడిఎస్ యు జిల్లా అధ్యక్షులు సాయికుమార్,జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్,టౌన్ నాయకులు రోషన్,భగవంతు,తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »