నారాయణ పేట జిల్లా ఉంటుందా లేదా?

నారాయణ పేట జిల్లా ఉంటుందా లేదా?

మాజి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి :ఙ్ఞాన తెలంగాణ నారాయణ పేట టౌన్ మే 3:నారాయణ పేట జిల్లా బి.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయంలో ఈరోజు ఎస్.రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంతకీ నారాయణ పేట జిల్లా ఉంటుందా ? లేదా ? అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీరు ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం 33 జిల్లాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం లో 17 జిల్లా లకు కుదించడం ఎంతవరకు సమంజసం అని మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. జిల్లా అభివృద్ధి జరిగిందని అనుకుంటే నారాయణ పేట జిల్లా లో కలక్టరేట్ భవనాలు ఎస్పీ కార్యాలయం, వివిధ శాఖల అధికారులు ఇక్కడ పాలన సాగుతోందని అటువంటి నారాయణ పేట జిల్లా ను మీరు తీసేస్తే మేము ఎంతకైనా తెగించి ముందుకు వెళ్తామని ఆయన తెలిపారు. ఇంతవరకు హామీ ఇచ్చిన మూడు మండలాలు ఏమైంది అని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. అదే బి.ఆర్.ఎస్.పార్టీ ప్రభుత్వం వచ్చినట్లు ఉంటే ఇంతవరకు మూడు మండలాలు జరిగేవి అని ఆయన తెలిపారు.

You may also like...

Translate »