తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఎండ తీవ్రత, వడగాల్పులు.

పిల్లలు, గర్భిణీ స్త్రీలు జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరిక..ఎల్ నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది.రాబోయే 4 రోజుల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని, వడగాలులు వీస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది. తెలంగాణలో పలుచోట్ల 46 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఎండల తీవ్రత కారణంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. మంచినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. భానుడు నిప్పులు చెరుగుతుండటంతో ఎండ తీవ్రత మరింత పెరిగింది.ఈ నెలలో 48 నుండి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఈ రోజు ఏపీలో 31 మండలాల్లో తీవ్రవడగాలులు, 234 మండలాల్లో వడగాలులు.. వడగాల్పుల కారణంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ఇళ్లలోంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక.

You may also like...

Translate »