Advance Happy birthday Rajesh. MA, B.Ed


అలుపెరుగని విద్యార్థి ఉద్యమ నాయకుడు

అలుపెరుగని విద్యార్థి ఉద్యమ నాయకుడు రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, అంతారం గ్రామ యువకుడు, బహుజన జాతి ముద్దుబిడ్డ, చేవెళ్ల మండలం లోని ప్రతి గ్రామం లో ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్.బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను వివిధ గ్రామ సర్పంచ్ లకు అందించి అంబేద్కర్ జీవిత చరిత్ర ని వివరిస్తూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్నటువంటి నీకార్సయినా లీడర్, అంబేద్కరిస్ట్ గా, చేవెళ్ల తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మా మిత్రుడు, స్నేహితుడు, ఖానాపురం రాజేష్. ప్రస్తుతం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( PDSU ) ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మా మిత్రుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా వారి వెన్నంటి ఉండేది ముందుగా రాజేష్. ఎందుకంటే తాను కూడా అనేక కటిక పేదరికం నుండి కష్టాలను, బాధలను అనుభవించి మంచి పేరు ప్రఖ్యాతలతో అంచలంచలుగా ఎదిగి ఉన్నత చదువులు చదువుతూ ( ప్రస్తుతం కాకతీయ యూనివార్సిటీ, K.U.లో పీజీ చదువుతున్నారు.) సమాజ మార్పు కోసం,, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఒక నాయకుడుగా తన వంతు కృషి చేస్తున్నాడు రాజేష్. తన వల్ల ఎవరికీ ఇబ్బంది రావొద్దు అని ఆలోచించే వ్యక్తి, నీతి నిజాయితీ గల వ్యక్తి, ముక్కు సూటి గా ప్రశ్నించే విద్యార్థి సంఘం నాయకుడు 2010 నుండి నేటి వరకు అనేక విద్యార్థి ఉద్యమాలు చేస్తూ… తన పోరాటాల ద్వారా చేవెళ్ల మండల కేంద్రం లో జర్నలిస్టుల సహాయంతో, SC, BC, విద్యార్థులకోసం ఒకటి బీసీ పోస్ట్ మెట్రిక్ బాయ్స్ హాస్టల్, ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అధికారులకు ఎన్నోసార్లు విన్నవించారు. ఫలితంగా మండల కేంద్రంలో వాటిని ఏర్పాటు కూడా చేశారు. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దానిని కూడా పూర్తి చేయడం జరిగింది. ఇలా ఖానాపురం రాజేష్ చేవెళ్ల మండలంలో ఒక విద్యార్థి సంఘం నాయకుడిగా, అంబేద్కరిస్టు గా, బహుజన వాదిగా మంచి గుర్తింపు పొందారు.

ఇలా మరెన్నో విజయాలను అందుకోవాలని ఆకాంక్షిస్తూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము …. 💐💐🤝🤝✊🏻✊🏻

మీ…. స్నేహితులు..

You may also like...

Translate »