కందుకూరు లో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే కార్యక్రమాన్ని కందుకూరు మండలంలోని నేదునూరు గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పాషా నరహరి స్తూపం దగ్గర మండల కేంద్రంలోని కామ్రేడ్ పాషా నరహరి భవనం దగ్గర నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ కందుకూరు మండల కార్యదర్శి బుడ్డీరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికా దేశం చికాగో నగరంలోనీ హే మార్కెట్ లో 1886 లో కార్మికులంతా ఏకమై మేము 18 గంటలు పని చేయలేము ఎనిమిది గంటలు పని చేస్తామని పని గంటలు తగ్గించాలని, కనీస వేతనం అమలు చెయ్యాలని ఆనాడు కార్మికులు పోరాటం చేయడం జరిగింది అన్నారు అక్కడున్న పెట్టుబడిదారు. యాజమాన్యాలు పోలీసులతో కాల్పులు జరిపించారు అన్నారు.కార్మికులు మే1న ర్యాలీకి పిలుపునిచ్చారని అన్నారు. లక్షల మంది ర్యాలీగా వెళుతుంటే వారి పైన కాల్పులు జరిపితే 6000 కార్మికులు చనిపోయారని అన్నారు. అందులో నుండి గాయాలైన కార్మికుడు లేచి తన జేబులో ఉన్న చేతి రుమాలు ను రక్తంలో ముంచి ఇదే మన ఎర్ర జెండా ఈ జెండా నే మన కండ అని నినాదాలు ఇచ్చారు. ఆనాటి నుండి నేటి వరకు మే 1న ప్రపంచవ్యాప్తంగా మేడే ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు. ఆనాడు ప్రాణాలులరిపించి సాధించుకున్న హక్కులను, నేడు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచుతూ కనీస వేతనాలు అమలు చేయకుండా కార్మికుల నడ్డి విరుస్తుందని బిజెపి ప్రభుత్వం పై మండిపడ్డారు. నేటి సమాజంలో ఒక కార్మికుడికి కనీస వేతనాలు 26000 వే రూపాయలు ఇవ్వాలని సుప్రీం కోర్టు చెపుతున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం కనీస వేతనాలు 4500 ఉంటే చాలు అని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు అన్నారు కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికుల శ్రమ దోపిడీ చేస్తూ… పెట్టుబడుదారులకు దోచిపెట్టడం కోసం బిజెపి ప్రభుత్వం నల్లచట్టాలను తీసుకొస్తుందని ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వ్యవసాయ కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనాలు అమలు చేయాలని 200 రోజులు పని కల్పించాలని రోజు కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికులు సంఘటితంగా పోరాడితేనే తమ బతుకులు మారుతాయన్నారు. కార్మికులు, ప్రజల కొరకు నిరంతరం పోరాడే కమ్యూనిస్టులను బలపరచాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు అంకగళ్ళ కుమార్, ఆర్ చందు బుట్టి బాలరాజ్, నాయకులు రాయి కంటి శేఖర్,గాదె సత్తయ్య,నేదునూరు గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు మిద్దె యాదయ్య, వి శ్రీరాములు, వి యాదయ్య, రాములు, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి అఫ్జల్ బేగ్, జి ప్రభాకర్ రెడ్డి, గ్రామ అధ్యక్షులు బి సురేష్, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు ఎం వెంకటేష్, ఏ దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »