చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయండి:

చల్లా వంశీచందర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయండి:
జ్ఞాన తెలంగాణ, నారాయణపేట టౌన్ , మే 1:నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామంలో యువకులు కార్యకర్తలు ఇంటింటా ప్రచారం కొనసాగించారు .మహబూబ్నగర్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి అయిన వంశీచంద్ రెడ్డి గారిని అత్యంత భారి మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించిన పేదల పార్టీ ,మన ఇంటి పార్టీ ,ప్రజల కోసం నిరంతరం శ్రమించే , నాయకుడు మన జిల్లా అభివృద్ధి కోసం పాటుపడే ప్రజల మధ్య నుండి ప్రజల మనసును గెలుచుకునే నాయకుడు చల్లా వంశీ చందు రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఈసారి తప్పకుండా గెలిపిద్దాం ,కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రతి కుటుంబానికి చేరుస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చెప్పటం అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా త్వరలో మొదలుపెడుతున్నమని మన నాయకుని గెలిపించాలని గ్రామస్తులకు తెలియజేయడం జరిగింది. పేదల కొరకు నిరుద్యోగుల రైతుల కష్టాలు చూసుకొని ఈసారి ప్రధాన మంత్రి నాయకుడు రాహుల్ గాంధీని చేయాలని ఇంటింటి ప్రచారం లో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.రాజ్యాంగం మనకు ఇచ్చిన ఓటు తోనే సాధ్యం ఆ స్వచ్ఛమైన ఓటుని చేతి గుర్తుకు వేయమని గ్రామ ప్రజలను. గ్రామ అధ్యక్షుడు లాలప్ప మండల యూత్ కార్యదర్శి శరత్ చంద్ర రాజు ,వెంకటేష్. పురుషోత్తం, రాజేష్, అంజి,మండల ఎస్సీ సెల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అంజప్ప ,తదితరులు పాల్గొన్నారు.