ఎంపీపీ బుద్ధె సావిత్రిని పరామర్శించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.

ఎంపీపీ బుద్ధె సావిత్రిని పరామర్శించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ.
జ్ఞాన తెలంగాణ- బోధన్
బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి భర్త మాజీ ఎంపిటిసి బుద్దె రాజేశ్వర్ గత నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వలన మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమాచారాన్ని తెలుసుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి మంగళవారం సాలూర గ్రామానికి వచ్చి ఎంపీపీ బుద్ధె సావిత్రి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ రంగంలో ఒక మంచి పేరు సాధించి తక్కువ వయసులో బుద్దె రాజేశ్వర్ హఠస్మరణం చెందడం కలిచివేసిందని అన్నారు. ఆపత్కాలంలో తాము అండగా ఉంటామని ఎలాంటి అధైర్యపడవద్దని ఎంపీపీ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఆయన వెంట ఉపాధ్యాయ సంఘం నేతలు ఇల్తెపు శంకర్ , నిజాంబాద్ జిల్లా పి టిఆర్టియు అధ్యక్షులు మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గౌడ్,కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుశాల్ వివిధ మండలాల ఉపాధ్యాయులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.