ఉత్తమ ఫలితాలు సాధించిన రాకాసిపేట్ హైస్కూల్ విద్యార్థులు

119 మంది విద్యార్థుల్లో 93 మంది ఉత్తీర్ణత. ఫోటోలు. జ్ఞాన తెలంగాణ- బోధన్ బోధన్ పట్టణంలోని రాకసిపేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల (జేసీ) విద్యార్థులు మంగళవారం విడుదలైన ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ పాఠశాలలో 116 మంది పరీక్షలకు హాజరుకాగా , అందులో 93 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిలో కిరణ్ 9.2 జిపిఏ, పల్లవి 9.0, షిఫా 9.0 ,మహేక్ బేగం 9.0, టి. అజయ్ 8.8 జిపిఎస్ సాధించి స్కూల్ టాపర్ గా నిలిచారు. పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను హెచ్ఎం బాలచంద్రం, ఉపాధ్యాయులు అభినందించారు.

You may also like...

Translate »