బీజేపీలోకి మాజీ సర్పంచ్ ల చేరికలు

బీజేపీలోకి మాజీ సర్పంచ్ ల చేరికలు
జ్ఞాన తెలంగాణ:రాజన్న ఇల్లంతకుంట మండలం మాజీ సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు చల్ల నారాయణ ఆధ్వర్యంలో , సోమవారంపేట మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి గూడెపుపల్లె మాజీ సర్పంచ్ గట్ల మల్లారెడ్డి, రామోజీపేట సర్పంచ్ మేఘాలవ్వ మొండయ్యా లను ఎంపీ బండి సంజయ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలొ బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ లు మల్లారెడ్డి, లాల రమేష్, సీనియర్ నాయకులు దేశెట్టి శ్రీనివాస్, దుద్దెడ రాజు ,మాజీ పార్టీ మండల అధ్యక్షుడు నాగసముద్రల సంతోష్,నాయకులు చల్ల రాజు, అసెంబ్లీ కో కన్వినర్, సీనియర్ నాయకులు అమ్ముల అశోక్, బీజేవైఎం అధ్యక్షుడు వజ్జపెల్లి శ్రీకాంత్, నాయకులు శ్రీనివాస్, పినికాసి అనిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.