కవులు, రచయితలపై దాడులు దుర్మార్గపు చర్య

కవులు, రచయితలపై దాడులు దుర్మార్గపు చర్య
జ్ఞాన తెలంగాణ నారాయణపేట టౌన్ ఏప్రిల్ 29:కాకతీయ యూనివర్సిటీలో కవులు రచయితలపై దాసులు చేయడం దుర్మార్గపు చర్య అని పి.డి.ఎస్.యు నారాయణపేట జిల్లా అధ్యక్షులు సాయికుమార్ అన్నారు.కాకతీయ విశ్వవిద్యాలయంలో సెక్యూలర్ రైటర్స్ ఫోరం సముహా రాష్ట్ర నదస్సు నిర్వహిస్తున్నారు. “లౌకిక విలువలు ప్రజాస్వామ్యం” అనే అంశంపై జరుగుతున్న సదస్సు హాల్ లోపలికి ఎబీవీపీకి చెందిన వారు వెళ్ళి సభా వేదికపై ఏర్పాటు చేసిన బ్యానర్ చింపి, సభను, రచయితల ప్రసంగాలను అడ్డుకున్నారు. ప్రొఫసర్ కాత్యాయని, డా॥ పసునూరి రవీందర్, నరేష్ కుమార్ షూపీ, మెర్సి మార్గరెట్, తదితరులను అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. దాడి చేయడమే కాకుండా అక్కడ ఉన్న మహిళ రచయితలపై అనుచీతంగా వ్యవరించారు. పూర్తి అనుమతులతో నిర్వహిస్తున్న సదస్సుపై దాడి చేయటాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఖండిస్తుంది.ఇది పూర్తిగా భావ ప్రకటన స్వేచ్ఛపై, ప్రజాస్వామ్య హక్కులపై జరిగిన దాడిగా పీడీఎస్ఈు భావిస్తుంది. భావజాలంపై స్వేచ్ఛాయుత చర్చలు చేయకుండా దాడులకు పూనుకోవడం సమంజసం కాదు, దేశంలో కలిసి మెలిసి జీవిస్తూ లౌకిక, ప్రజాస్వామిక వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్శీటీలలో విద్యార్ధి సంఘం పేరుతో ఎలీవీపీ అనేక రకాలు, అకృత్యాలకు ఒడిగడుతుంది. రాష్ట్రంలోని యూనివర్శీటీలలో ప్రశాంతమైన అకడమిక్ వాతావరణం, భావప్రకటనను ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. మొన్నా హెచ్.సి.యు.లో విద్యార్థులపై దాడి, నేడు కాకతీయ విశ్వవిద్యాలయంలో కవులు, రచయితలపై దాడి చేయడం అనేది హేయమైన చర్య బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘం ఏబీవీపీ వారు రచయితలు, కవుల మీద దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.